రవితేజ సినిమాలో విలన్ అతనే !
Published on Mar 10, 2018 10:58 am IST

తాజాగా రవితేజ, శ్రీను వైట్ల సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. అను ఇమ్మన్యూల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో తరుణ్ అరోరా విలన్ గా నటిస్తున్నాడు. ఈ విలన్ గతంలో దూకుడు సినిమాలో నటించాడు. ఆ తరువాత చిరంజీవి ఖైది నెంబర్ 150 పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమాల్లో నటించాడు.

శ్రీనువైట్ల సినిమాతో తెలుగులో సినిమా చేసిన తరుణ్ అరోరా మళ్ళి శ్రీను వైట్ల సినిమాలో మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు. సినిమా ఎక్కువ శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుకుంటుంది. అమర్ అక్బర్ అంథోని పేరుతో తెరకేక్కబోయే ఈ సినిమా రవితేజ స్టైల్ లో మాస్ ఎంటర్టైనర్ గా తెరకేక్కబోతోంది. ఏప్రిల్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

 
Like us on Facebook