‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ కి ఆ సర్ప్రైజింగ్ స్టార్ ఎవరంటే!?

‘పెద్ది’ బ్లాక్ బస్టర్ ఈవెంట్ కి ఆ సర్ప్రైజింగ్ స్టార్ ఎవరంటే!?

Published on Jun 23, 2026 1:02 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చి బాబు సానా తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా సినిమానే పెద్ది. మంచి అంచనాలు సెట్ చేసుకొని టాలీవుడ్ ఎదురు చూస్తున్న బిగ్ హిట్ ని వీరు అందించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద టార్గెట్ తోనే వచ్చినప్పటికీ పెద్ది వాటిని రీచ్ అవుతూ విజయ బావుటా ఎగురవేసాడు.

దీనితో మేకర్స్ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్ ని జూన్ 23న లాక్ చేశారు. అయితే ఈ ఈవెంట్ కి స్పెషల్ సర్ప్రైజింగ్ గెస్ట్ ఉన్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. కానీ పేరు రివీల్ చేయలేదు. అయితే ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు అలాగే వృద్ది సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు