‘హెబ్బా’ ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కూడా ?

Published on Mar 31, 2020 2:00 am IST

సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘ఇస్మార్ట్ శంకర్‌’ తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ హీరోగా చేస్తున్న ‘రెడ్’ సినిమాలో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ఐటమ్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. సెకెండ్ హాఫ్ లో వచ్చే ఒక స్పెషల్ సాంగ్ లో హెబ్బా కనిపించనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హెబ్బా ఈ సాంగ్ కోసం కనిపించబోతుందట. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం హెబ్బా సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు గెస్ట్ రోల్ లో కూడా నటిస్తోందట. కేవలం రెండు సీన్స్ లో మాత్రమే హబ్బా పాత్ర ఉన్నప్పటికీ అవి చాల కీలమైన సీన్స్ అట.

కాగా ఈ పాటను ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ అండ్ హెబ్బా మీద షూట్ చేశారు. సాంగ్ అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందట. మొత్తానికి హీరోయిన్ క్యారెక్టర్స్ కే ఫిక్స్ కాకుండా సైడ్ క్యారెక్టర్స్ అండ్ స్పెషల్ సాంగ్స్ తో హెబ్బా మెరుస్తోంది. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ ఫోన్ అయింది.

కాగా ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More