వెస్ట్ గోదావరిలోనూ ‘శివమ్’ కి బంపర్ ప్రైజ్

వెస్ట్ గోదావరిలోనూ ‘శివమ్’ కి బంపర్ ప్రైజ్

Published on Sep 27, 2015 1:00 PM IST

Shivam

మే చివర్లో ‘పండగ చేస్కో’ అంటూ వచ్చి తెలుగు ప్రేక్షకులను నవ్వించిన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ అప్పుడే తన మరో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి సిద్దమైపోయాడు. ఆ సినిమానే ‘శివమ్’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. సెన్సార్ కూడా పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ మరియు సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాకి బిజినెస్ పరంగా కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఇప్పటికే వైజాగ్ రైట్స్ ని 2.25 కోట్లకి తీసుకున్నారని తెలిపాం, మాకు అందిన లేటెస్ట్ సమాచారం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా రైట్స్ కూడా భారీ మొత్తానికే అమ్ముడు పోయాయి. పశ్చిమ గోదావరి రైట్స్ ని కూడా 1.25కోట్లకి కొనుగోలు చేసినట్లు సమాచారం. అలాగే అన్ని ఏరియాలలో రామ్ గత సినిమాలకంటే ఎక్కువగానే బిజినెస్ అయినట్లు చెబుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతూ చేస్తున్న ఈ సినిమాని స్రవంతి రవికిషోర్ నిర్మించాడు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు