‘హలో గురు..’ నైజాంలో రెండు రోజుల కలెక్షన్స్ !

Published on Oct 20, 2018 12:24 pm IST


దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. కాగా దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ పరంగా కూడా రామ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.

నైజాం ఏరియాలో ఈ చిత్రం మొదటి రోజున 1.4 కోట్ల షేర్ ను రాబట్టగా, రెండవ రోజున 1.35 కోట్లను వసూళ్లు చేసింది. ఇక వారాంతం ముగిసే సరికి బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

మంచి లవ్ సబ్జెక్ట్ తో ఎంటర్టైన్ మెంట్ తో సాగే ఈ చిత్రంలో రామ్, అనుపమా పరమేశ్వరన్ జోడీ తమ నటనతో బాగా ఆకట్టుకుంటారు. అలాగే ప్రకాష్ రాజ్ కూడా తన మార్క్ నటనతో మెప్పిస్తాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం :