‘హలో గురు..’ ఇప్పటివరకు పది కోట్లు !

Published on Oct 21, 2018 11:13 am IST

రామ్ హీరోగా దర్శకుడు నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దసరా కానుకగా అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీతో మరియు మంచి ఎంటర్టైన్ మెంట్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. కలెక్షన్స్ పరంగా కూడా రామ్ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ ను రాబడుతుంది.

తాజాగా ట్రేడ్ వర్గాల తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో శనివారం నాటికీ ఈ చిత్రం రూ. 3 కోట్లను వసూళ్లను సాధించింది. కాగా మొత్తం మూడు రోజులకు గానూ ఈ చిత్రం రూ .10.52 కోట్లను వసూళ్లను రాబట్టింది. ఇక ఆదివారం ముందస్తు బుకింగ్ లు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నాయి, కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఏ రేంజ్ లో నిలబడుతుందో తెలియాలంటే.. సోమవారం నుండి ఈ సినిమా సాధించే కలెక్షన్స్ పై ఆధారపడి ఉంటుంది.

దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు.

సంబంధిత సమాచారం :