మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో. బ్యూటీ పూజా హెగ్డే బన్నీకి జంటగా నటిస్తుండగా టబు, హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక రోల్స్ చేస్తున్నారు. థమన్ సాంగ్స్ మరియు త్రివిక్రమ్ మార్క్ టీజర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. కాగా ఈ చిత్రం నుండి నాలుగో సాంగ్ బుట్ట బొమ్మ టీజర్ నేడు విడుదలైంది.
‘బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా.. నన్ను సుట్టు కుంటివే…. , జిందగీకే అట్టబొమ్మై అట్ట అంటుకుంటివే..’ అనే రెండు చరణాలు గల ఈసాంగ్ టీజర్ ని అర్మాన్ మాలిక్ పాడగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ఈ సాంగ్ పూర్తి వీడియో ఈనెల 24న రానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న అలవైకుంఠపురంలో విడుదల కానుంది.
సాంగ్ టీజర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి


