“ఆచార్య” బ్యాలన్స్ షూట్ పై లేటెస్ట్ ఇన్ఫో ఇదే.!

Published on Aug 5, 2021 10:11 am IST

మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి కొన్ని రోజులు కితమే ఫైనల్ షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యిన ఈ చిత్రం నిన్నటితో టాకీ పార్ట్ అంతటినీ కంప్లీట్ చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది. అయితే ఇంకా పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. మరి దీనిపైనే తాజా సమాచారం ఇపుడు వినిపిస్తుంది.

మరి దాని ప్రకారం ఈ ఆగష్టు 20వ తారీఖు నుంచి 25 వరకు ఒక సాంగ్ షూట్ ని ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఇందులో చిరు, చరణ్ మరియు పూజా లు పాల్గొననున్నట్టు తెలుస్తుంది. అలాగే మరో సాంగ్ ని 26 నుంచి స్టార్ట్ చేసి ఈ నెలాఖరుతో కంప్లీట్ చేసేయనున్నారట. దీనితో ఈ మంత్ ఎండింగ్ తో ఆచార్య కంప్లీట్ షూట్ అయ్యిపోవడం కన్ఫర్మ్ అని చెప్పాలి. మరి ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :