పవన్ ఫ్యాన్స్ అప్పటి వరకు ఆగాల్సిందే..!

Published on Jul 5, 2020 10:46 am IST

పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం వకీల్ సాబ్. ఆయన నుండి రెండేళ్ల తరవాత వస్తున్న మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పవన్ కమ్ బ్యాక్ మూవీగా వస్తున్న వకీల్ సాబ్ ఎప్పుడో విడుదల కావాల్సింది. షూటింగ్ చివరి దశలో ఉండగా కరోనా వైరస్ కారణంగా బ్రేక్ పడింది. కేవలం 20 రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉండగా ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడు తిరిగి మొదలవుతుందని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొని ఉంది.

కాగా వకీల్ షాబ్ సాబ్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు అవుతుందనేది తాజా సమాచారం. మొదలైన వెంటనే త్వర త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది చివర్లో మూవీ విడుదల చేయాలనేది దర్శక నిర్మాతల ఆలోచనట. ఐతే ఈ ప్రణాళికలన్నీ అమలు అవ్వాలంటే సాధారణ పరిస్థితులు ఏర్పడితేనే జరుగుతుంది. వకీల్ సాబ్ మూవీకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More