జాన్ చిత్రంపై ప్రభాస్ ఇచ్చిన అప్డేట్ ఇదే..!

Published on Jan 17, 2020 2:13 pm IST

ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసిన అప్డేట్ వచ్చేసింది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆయన ఓ ఫోటో స్టిల్ పంచుకోవడంతో పాటు, లేటెస్ట్ మూవీ షూట్ తిరిగి మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. అలాగే ఈ షెడ్యూల్ చాలా ఫన్ రైడ్ లా ఉంటుందని డిస్క్రిప్షన్ పెట్టారు. ఓ విలాసవంతమైన వింటేజ్ భవంతిలో పురాతన పియానో, గోడలపై చాలా ఫోటో గ్రాఫ్స్ ఉండగా వాటి వైపు ఆసక్తిగా చూస్తున్న ప్రభాస్ లుక్ ఆసక్తి రేపుతోంది. జాన్ అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ప్రభాస్ సూపర్ హిట్ కొట్టడం ఖాయం.

దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని 1960ల నాటి ప్రేమకథగా తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే మొదటిసారి ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. సాహో చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. సినిమా కథ రీత్యా చాలా భాగం యూరప్ లో చిత్రీకరించాల్సి ఉండగా, చాలా వరకు సెట్స్ వేసి చిత్రీకరిస్తున్నారు. ఏదైతేనేమి ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూసిన, అప్డేట్ వచ్చేసింది.

సంబంధిత సమాచారం :

X
More