టైటిల్ సాంగ్ తో ఆకట్టుకుంటున్న వెంకీమామ !

Published on Nov 7, 2019 9:13 pm IST

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ ‘వెంకీ మామ’. కె. ఎస్.రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ చివరి దశ పనుల్లో ఉంది. కాగా తాజాగా ఈ సినిమా నుండి వెంకీ మామ టైటిల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. సినిమా థీమ్ సాంగ్ గా వచ్చిన ఈ సాంగ్ సినిమాలో వెంకటేష్ అండ్ నాగ చైతన్య పాత్రల మధ్య అనుబంధాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసింది. హీరోల పాత్రల పై పూర్తిగా సాగిన ఈ పాటకు తమన్ మంచి ట్యూన్ తో చక్కగా తీర్చిదిద్దారు.

అందుకు తగ్గట్లుగానే ఈ పాట ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ఇక ఈ పాటను ప్రతి మామ అల్లుళ్లకు డెడికేట్ చేశారు. ఫుల్ జోష్ మీదున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇందులో చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తుండగా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ మెరవనుంది. సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :