ట్రైలర్ తో ఎంటర్ టైన్ చేస్తోన్న బుజ్జిగాడు !

Published on Sep 28, 2020 10:35 am IST

రాజ్‌ త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్ తెరక్కిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ లా సాగిన ఈ ట్రైలర్ లో కామెడీ అండ్ రొమాన్స్ తో పాటు డైలాగ్స్ కూడా బాగున్నాయి. మొత్తానికి ట్రైలర్ ను చూస్తుంటే సినిమా mమిస్ అండర్ స్టాండింగ్ ప్లే సాగుతూ ఫుల్ కామెడీని పంచేలా ఉంది. ఇక రాజ్ తరుణ్ కూడా ఫుల్ హుషారుగా కనిపించాడు.

కాగా లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకం పై ఏమైంది ఈ వేళ‌, బెంగాల్ టైగ‌ర్‌ వంటి హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌ గా కార్తి ఖైదీ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌ బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్, ఆయనే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక రాజ్‌ త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా కీల‌క‌మైన పాత్ర‌లో యూత్‌కి ద‌గ్గ‌రైన హాట్ బ్యూటీ హెబ్బా ప‌టేల్ నటిస్తోంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More