‘ప్రాణం’ అంటూ ఆకట్టుకుంటున్న ‘జాను’ !

Published on Jan 21, 2020 7:02 pm IST

అక్కినేని సమంత, శర్వానంద్ ల ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘జాను’ సినిమా నుండి లిరికల్ వీడియో సాంగ్ ‘ప్రాణం’ విడుదల అయింది. ‘ప్రాణం’..అంటూ సాగిన ఈ ఫస్ట్ సింగిల్ మెలోడియస్ గా సాగుతూ ప్రేమికుల మనసును హత్తుకునేలా ఉంది. శ్రీమణి అందించిన సాహిత్యం సరళమైన పదాలతో పాటు అర్ధవంతమైన భావాలతో ఉండటం, అలాగే ఫీల్ గుడ్ ట్యూన్ తో గోవింద్ వసంత్ సాంగ్ ను అద్భుతంగా కంపోజ్ చేయడంతో ఈ సాంగ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

ఇక జాను తమిళ చిత్రం ’96’కి తెలుగు రీమేక్. తమిళంలో త్రిషా, విజయ్ సేతుపతి చేసిన పాత్రలను ఇక్కడ సమంత, శర్వానంద్ చేస్తున్నారు. జాను టీజర్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి మంచి స్పందన వచ్చింది. కాగా ఒరిజినల్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగు వర్షన్ ‘జాను’కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

కాగా ’96’ సినిమాకు స్వరాలు అందించిన గోవింద్ వసంత్ జాను కి మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :