కొత్త సినిమా లుక్స్ తో అజిత్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్.!

Published on Mar 3, 2022 7:00 pm IST


కోలీవుడ్ బిగ్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ చిత్రం “వలిమై” పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. తమిళ్ లో అయితే రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్న ఈ చిత్రంని తెరకెక్కించిన దర్శకుడు హెచ్ వినోద్ మళ్ళీ అజిత్ తోనే ఇంకో సాలిడ్ సబ్జెక్టు ని చేయబోతున్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాలో అజిత్ లుక్ ఎలా ఉండబోతుంది అనేది ఇది వరకే ఒక ప్రీ లుక్ పోస్టర్ తో తీజ్ చెయ్యగా ఇప్పుడు ఈ కంప్లీట్ లుక్ అనధికారికంగా రివీల్ కావడం ఆసక్తిగా మారింది. అజిత్ లేటెస్ట్ గా తన ఫ్యామిలీ తో కలసి ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బయటకి వచ్చాయి. దీనితో తన 61వ సినిమాలో ఎలా ఉంటాడో ఆ కంప్లీట్ లుక్ రివీల్ అయ్యింది. పూర్తిగా నెరిసిన తల కొత్తరకం గడ్డం స్టైల్ తో అజిత్ కొత్తగా కనిపిస్తున్నాడు. దీనితో ఈ కొత్త లుక్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం :