వివాదాలతో ఈ హీరోకి ఒరిగేదేముంది

Published on Jul 26, 2019 9:43 am IST

హీరో ఆకాష్ తమిళ చిత్రాలతో నటుడిగా పరిచయమై, శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన “ఆనందం” సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం విజయం సాధించడంతో ఆకాష్ తెలుగులో అవకాశాలు దక్కించుకొని కొన్ని సినిమాలు చేసినా, అవి ఆశించిన విజయం సాధించక పోవడంతో ఆయనకు హీరోగా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఆ తరువాత ఆయన సెకండ్ హీరోగా, ప్రాధాన్యం ఉన్న పాత్రలలో కనిపించారు.

కాగా తాజాగా ఆయన వరుస వివాదాలతో వార్తలలో నిలుస్తున్నారు. ఇటీవల విజయం సాధించిన “ఇస్మార్ట్ శంకర్” కథ నాదే పూరి నా కథ కాపీ కొట్టి, నన్ను మోసం చేసారంటూ ఆరోపణలు చేయడం జరిగింది.కానీ పూరి ఈ కామెంట్స్ పై ఎక్కడా అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. అలాగే హీరో సునీల్ పై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు భయ్యా అని సంభోదించిన సునీల్, ఆతరువాత మర్యాద లేకుండా ఏం ఆకాష్ అని పిలిచాడన్నారు. అందాల రాముడు సినిమాలో నన్ను నటింపచేయడానికి బ్రతిమిలాడిన సునీల్, మూవీలో తన పాత్ర పరిధిని తగ్గించి చూపారు అని అన్నారు. సునీల్ కి కృతజ్ఞత లేదని ఆయన వాపోయారు. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల వలన ఆకాష్ కి దక్కే ప్రయోజనం ఏముంది అన్నదే అసలు ప్రశ్న.

సంబంధిత సమాచారం :