607 థియేటర్స్ లో ‘ఏబీసీడీ’ !

Published on May 16, 2019 9:44 pm IST

యువ కథానాయకుడు అల్లు శిరీష్‌ హీరోగా సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మణంలో రాబోతున్న సినిమా ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ ట్యాగ్‌ లైన్‌. కాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ సుమారు 607 థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

ఇక సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాలో మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు, బాల నటుడు భరత్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు శిరీష్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

కాగా మంచి హిట్ కోసం ఎప్పటినుంచో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోన్న అల్లు శిరీష్ ఈ సినిమాతో హిట్ కొడతాడా ? కంటెంట్ పరంగా చూసుకుంటే ‘ఏబిసిడి’లో విషయం కాస్త గట్టిగానే ఉందనిపిస్తోంది. మరి ఈ సినిమానైనా అల్లు శిరీష్ కి భారీ హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More