వరద బాధితుల కోసం భారీ విరాళం ప్రకటించిన హీరో రామ్

Published on Oct 20, 2020 8:04 pm IST


హైదరాబాద్ నగరం వరద భీభత్సంతో అతలాకుతలమవుతోంది. అనేక ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి. వందలమంది ప్రజలు అన్నీ కోల్పోయి నిరాశ్రయులు అయ్యారు. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ప్రభుత్వానికి మద్దతుగా తెలుగు సినీ ప్రముఖుకు నడుం బిగించారు. చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్, నాగర్జున లాంటి పెద్ద వాళ్లు భారీ విరాళం ప్రకటించగా త్రివిక్రమ్ శ్రీనివాస్, విజయ్ దేవరకొండ, అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్ లాంటి వారంతా తమ వంతు సహాయం ప్రకటించారు.

తాజాగా యువ హీరో రామ్ సైతం 25 లక్షల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. కేటీఆర్ తొలిరోజు నుండి వరద బాధితులకు అండగా ఉంటూ వస్తున్నారని, వారి మన మద్దతు ఉండాలి అంటూ విరాళం ప్రకటించారు. కేటీఆర్ సైతం రామ్ సహాయాన్ని అభినందిస్తూ కృతజ్ఞలు తెలియజేశారు. ఇలా సినీ పరిశ్రమ హైదరాబాద్ కోసం ముందుకు రావడాన్ని అందరూ అభినందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More