స్టేడియం లో మహేష్ ఏంచేస్తున్నారు…?

Published on Jul 11, 2019 12:15 pm IST

ప్రిన్స్ మహేష్,డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరూ” కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మహేష్ మొదటిసారి అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో మహేష్ పై కీలకమైన బోర్డర్ సన్నివేశాలు కాశ్మీర్ లో చిత్రీకరిస్తున్నారని సమాచారం.మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

ఐతే ఓ క్రీడామైదానం లో మహేష్ ఉన్న ఓ ఫొటో కొద్దిసేపటి క్రితం లీక్ ఐయ్యింది.ఆ ఫోటో చూస్తుంటే చుట్టూ స్టేడియం ఉన్న గ్రౌండ్ లో చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. మరి ఆ లోకేషన్ లో మహేష్ పై యాక్షన్ సన్నివేశాలు, చిత్రీకరిస్తున్నారా..? లేక ఏదైనా క్రీడకు సంబందించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారా? లేదంటే మహేష్ యాడ్ షూటింగ్ లో పాల్గొంటున్నారట? అనేది తెలియాల్సివుంది.

సంబంధిత సమాచారం :

X
More