ప్రమోషన్ పేరుతో డైరెక్టర్ తో ఆడుకున్న నాగ్…!

Published on Jul 20, 2019 1:51 pm IST

నాగ్ నటించిన “మన్మధుడు 2” ఇంకొద్ది రోజులలో థియేటర్లలో సందడి చేయనుంది. దీనితో కింగ్ నాగార్జున వినూత్న రీతిలో ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఈ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర తో ఓ ప్రాంక్ వీడియో చేసిన నాగార్జున అతనితో కొద్దిసేపు ఆడుకున్నాడు. తనకిష్టమైన ఫుడ్ ఐటెం కోసం ఓ రెస్టారెంట్ కి రాహుల్ ని పంపిన నాగ్ అక్కడ వేరే కస్టమర్ ఆర్డర్ చేసిన జ్యూస్ తాగమని, పరిచయం లేని అమ్మాయితో మాట్లాడమని, వెయిటర్ తో దురుసుగా ప్రవర్తించమని, వింత వింత పనులు చేయించాడు. కొంచెం ఇబ్బంది పడుతూనే రాహుల్ ఆ టాస్క్ లు మొత్తం పూర్తి చేశాడు. సినిమా ప్రచారం కొరకు నాగ్ ఎంచుకున్న మార్గం వైవిధ్యంగా అనిపించింది.

రకుల్,కీర్తి సురేష్, వెన్నెల కిషోర్,లక్ష్మి వంటి నటులు ముఖ్య పాత్రలలో కనిపిస్తుండగా, అన్నపూర్ణ స్టూడియోస్, వికామ్ 18 స్టూడియోస్,ఆనంది ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే నెల 9న విడుదల కానుంది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :