‘సాహో’ టీజర్ పై నాని రియాక్షన్ చూశారా…!

Published on Jun 13, 2019 3:58 pm IST

ఈ రోజు రెండు పెద్ద సినిమాల బ్యాక్ టు బ్యాక్ టీజర్ లను విడుదల చేసి టాలీవుడ్ సినీ ప్రేమికులకు మంచి వినోదం పంచారు. ఒకటి కింగ్ నాగార్జున నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “మన్మధుడు 2” టీజర్ కాగా , మరొకటి ప్రభాస్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఈ రెండు టీజర్ ల పై సినీ ప్రముఖులు, అలాగే నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో నాచురల్ స్టార్ నాని ట్విట్టర్ వేదికగా ఈ రెండు చిత్రాలు టీజర్ లపై తన స్పందన తెలియజేశాడు. ఈ రోజు విడుదలైన రెండు టీజర్లను బాగా ఇష్టపడుతున్నానన్న నాని, నాగార్జున గారు టీజర్ లో చాలా ఫైర్ తో కనిపించి, టీజర్ ని హీటెక్కించారు అన్నారు. అలాగే మూవీలో నటించిన రకుల్,కీర్తి సురేష్ లకు దర్శకత్వం వహించిన రాహుల్ రవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే సాహో మూవీ పై కూడా ప్రశంసలు కురిపించిన నాని, దర్శకుడు సుజీత్ ని ఉద్దేశిస్తూ టీజర్ చివర్లో ప్రభాస్ పిడికిలి బిగించి నడుచుకుంటూ వస్తున్న ఆ ఒక్క షాట్ చాలు, మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఫుల్ ఐపోవడాని అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. ఏమైనా ప్రేక్షకులనే కాదు స్టార్స్ ని కూడా ‘సాహో’ మేనియా వెంటాడుతుంది.

సంబంధిత సమాచారం :

X
More