విరాటపర్వం సినిమాపై యంగ్ హీరో నిఖిల్ రివ్యూ..!

విరాటపర్వం సినిమాపై యంగ్ హీరో నిఖిల్ రివ్యూ..!

Published on Jun 9, 2022 1:05 AM IST

దగ్గుబాటి రానా-సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “విరాటపర్వం”. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాపడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు జూన్ 17న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ఇటీవల ప్రకటించిన మేకర్స్ అందుకు తగ్గట్టుగా ప్రమోషన్లను కూడా గట్టిగానే జరుపుతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాని చూసిన యంగ్ హీరో నిఖిల్ తన రివ్యూని చెప్పేశాడు. ఈ ఎపిక్ లవ్ స్టోరీ నన్ను ఒకింత షాకింగ్‌కి గురిచేసిందని అంతేకాకుండా సినిమా చాలా అద్భుతంగా ఉందని ట్వ్వీట్ చేశారు. సాయి పల్లవి కెరీర్ బెస్ట్ ఫర్ఫార్మెన్స్ ఇచ్చిందని, రానా దగ్గుబాటి నటన కూడా చాలా బాగుందని అన్నాడు. ఈ సినిమాను అద్భుతమైన వీక్షణగా మార్చిన వేణు ఉడుగుల గారికి మరియు సుధాకర్ చెరుకూరి గారికి హ్యాట్సాఫ్ అని అన్నాడు.

https://twitter.com/actor_Nikhil/status/1534588392997982208?s=20&t=guUDouH2y5rmbU_pdxN4JQ

సంబంధిత సమాచారం

తాజా వార్తలు