ప్రముఖ గాయని సునీత ఇటీవల రామ్ వీరపనేని తో నిశ్చితార్దం జరుపుకున్న సంగతి తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ నిశ్చితార్దం జరిగింది. అయితే వచ్చే ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోనున్నారు. అయితే సునీత కు రామ్ వేరపనేని కి సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. తాజాగా వీరు ఒక పార్టీ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ప్రముఖ స్టార్ హీరో నితిన్ ఈ జంటకు ప్రి వెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. నితిన్ మరియు రామ్ వీరపనేని సన్నిహితులు కావడం చేత ఈ పార్టీ ఇచ్చి ఉండవచ్చు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ పార్టీ లో రేణు దేశాయ్, సుమ కనకాల తో పాటుగా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు తెలుస్తోంది.


