హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న హీరో చెల్లెలు

Published on Jun 13, 2019 2:00 am IST

సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా కామన్. కుటుంబలో ఒకరు నిలదొక్కుకుంటే చాలు ఇక వరుసగా ఆ కుటుంబంలో ని వారు హీరోలుగా తమ అదృష్టం పరీక్షించుకునే పనిలో ఉంటారు. ఐతే హీరో కుటుంబం నుండి చల్లెళ్ళు సినీరంగ ప్రవేశం చేయడం కొంచెం అరుదుగా జరుగుతుంది. ఇలాంటి సంఘటనే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్ రెహమాన్ మేనల్లుడైన, జి వి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ ఇండస్ట్రీలోకి ప్రవేశించి ప్రస్తుతం హీరో గా నటిస్తున్నారు.

తన బాడీ లాంగ్వేజ్ కి తగిన సినిమాలు చేస్తూ ఆయన మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఆయన చెల్లెలు భవానిశ్రీ హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుందని సమాచారం. దర్శకుడు విరుమాండి తమిళంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ ను తీసుకున్నారు. మరో కథానాయికగా భవానీశ్రీని ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం సెట్స్ పై వున్న ఈ సినిమాను, తెలుగులోను విడుదల చేసే ఆలోచనలో వున్నారు.

సంబంధిత సమాచారం :

More