‘అనుభవించు రాజా’తో రెడీ అయిపోయిన రాజ్ తరుణ్..!

Published on Aug 17, 2021 2:00 am IST

యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కుర్ర హీరో మధ్యలో ఒకటి రెండు సినిమాలతో పర్వాలేదనిపించినా చాలా వరకు ప్లాపులే చవిచూశాడు. అయితే 2016లో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ సినిమాను రూపొందించిన శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో ‘అనుభవించు రాజా’ సినిమా తెరకెక్కింది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా మోడల్ కాషిశ్‌ ఖాన్ నటిస్తుంది. అయితే సైలెంట్‌గా మొదలైన ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌కి కూడా వచ్చేస్తుందని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమానైనా రాజ్ తరుణ్‌కి హిట్ అందిస్తుందేమో చూడాలి మరీ. ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ లేటెస్ట్ సినిమా ‘స్టాండప్ రాహుల్’పై కూడా మంచి బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :