మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) రేపు తన తల్లి సురేఖతో కలిసి రేపు పిఠాపురం వెళ్లనున్నారు. స్టార్ హీరో పిఠాపురంలోని శ్రీ కుక్కుటేశ్వర ఆలయాన్ని ప్రత్యేకంగా సందర్శించనున్నారు. రామ్ చరణ్ బాబాయ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అందుకే, చరణ్ పిఠాపురం పర్యటన కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది.
మరి ఈ హీరో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేస్తాడో లేదో చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం పొలిటికల్ యాక్షన్ డ్రామా గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా సంవత్సరాలుగా రూపొందుతోంది. ఈ చిత్రం విడుదల తేదీ ప్రకటన కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గేమ్ ఛేంజర్‌తో పాటు బుచ్చిబాబు, సుకుమార్‌లతో రామ్‌చరణ్‌కు సినిమాలున్నాయి.