ఇస్మార్ట్ శంకర్ క్రిటిక్స్ పై రామ్ కౌంటర్ అదిరిందిగా

Published on Jul 23, 2019 1:32 pm IST

హీరో రామ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంపై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో స్పందించారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. “హీరో హెల్మెట్ పెట్టుకోలేదు…,హీరో స్మోక్ చేస్తున్నాడు…,హీరో అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వలేదు…,ఎంత సేపూ…. ఇవేగాని,అక్కడ హీరో అడ్డమొచ్చిన వాడినల్లా చంపేస్తున్నాడని ఒక్కడు కూడా కంప్లైంట్ చేయడం లేదు.. ప్రాణాలకు విలువ లేదు,బాధాకరం” అని పోస్ట్ చేశారు.

మనిషి ప్రాణం కంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం,దమ్ముకొట్టడడం,అమ్మాయిలకు గౌరవం ఇవ్వకపోవడం విలువైనవా అన్నట్లుగా సెటైరికల్ గా ఆయన ట్వీట్ చేశారు. మరి ఈ ట్వీట్ రామ్ మూవీ ప్రచారం కోసం చేసాడో,తన సినిమాను విమర్శిస్తున్న వారిపై కౌంటర్ గా వేశాడో తెలియాల్సివుంది. కాగా ఇస్మార్ట్ శంకర్ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల వరకే 22కోట్ల షేర్ సాధించింది.

సంబంధిత సమాచారం :

More