రామ్ పోతినేని లేటెస్ట్ మూవీలో విలన్‌గా ఆర్య?

Published on Jul 13, 2021 3:02 am IST

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్‌గా లింగు స్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా వ‌స్తున్న ఈ మూవీలో రామ్ డ్యుయ‌ల్ రోల్ చేస్తున్న‌ట్టు టాలీవుడ్ స‌ర్కిల్ టాక్‌.

అయితే శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ‘ఉస్తాద్’ అనే టైటిల్ దాదాపు ఖాయమైందని, త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది పక్కనపెడితే ఈ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అలికిడి ఒకటి తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో రామ్ ను ఢీ కొట్టేందుకు తమిళ హీరో ఆర్య విలన్‌గా నటించనున్నాడట. అయితే ఇందులో ఎంతవరకు నిజమన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :