మరోసారి తెలంగాణ యాస లో రామ్ !

Published on Feb 15, 2019 9:53 am IST


ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ లోకల్ కుర్రాడిగా నటిస్తున్నాడు. అంతేకాదు ఫస్ట్ టైం తెలంగాణ యాస లో డైలాగ్స్ చెప్పనున్నాడు. పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈచిత్రం తరువాత రామ్ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ఈ చిత్రంలో కూడా రామ్ తెలంగాణ యాసలోనే మాట్లాడనున్నాడని సమాచారం. ఈచిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.

స్రవంతి మూవీస్ పతాకం ఫై స్రవంతి రవికిశోర్ నిర్మించనున్న ఈచిత్రం జూన్ నుండి ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.

సంబంధిత సమాచారం :