‘రామ్’ కృతి శెట్టితో స్టార్ట్ చేశాడు.. !

Published on Jul 12, 2021 3:00 pm IST

హీరో రామ్ పోతినేనితో తమిళ దర్శకుడు లింగుస్వామి చేయబోతున్న సినిమా షూటింగ్ ఈ రోజు మొదలైంది. షూట్ కి సంబంధించిన అప్ డేట్ ను చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ప్రకటించింది. ఈ సినిమా షూటింగ్ లో రామ్ తో పాటు హీరోయిన్ కృతి శెట్టి కూడా పాల్గొంటుంది అని తెలుస్తోంది. ఇక సంచలన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటల్లో రెండు ట్యూన్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి.

రామ్ – దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్లో గతంలో ‘జగడం, రెడీ, ఉన్నది ఒకటే జిందగీ, హలో గురూ ప్రేమకోసమే, నేను శైలజ, శివమ్’ లాంటి సినిమాలు వచ్చాయి. మ్యూజిక్ పరంగా ఈ చిత్రాలన్నీ సూపర్ హిట్సే. మళ్ళీ ఇప్పుడు వీరి కలయికలో వస్తోన్న ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే బజ్ ఉంది. తెలుగు, తమిళం రెండు భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయకిగా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :