ఇస్మార్ట్ హీరో కొత్త చిత్రం ప్రకటించరే… !

Published on Aug 9, 2019 7:00 am IST

ఎట్టకేలకు ఒక భారీ హిట్ హీరో రామ్ తన ఖాతాలో వేసుకున్నారు. పూరి మాయ ఈసారి తెరపై పేలింది, ఇస్మార్ట్ శంకర్ రూపంలో అద్భుతం చేసింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ చిత్రం ఏకంగా 80కోట్ల వసూళ్లు వైపుగా దూసుకుపోతుంది. సినిమాకు వస్తున్న ఆదరణ రీత్యా రెండు వారాలకు పైగా ప్రొమోషన్స్ చేస్తూనే ఉన్నారు చిత్ర యూనిట్.మొన్నటి వరకు విదేశీ విహారంలో ఉన్న రామ్ ఓ వారం క్రితం తిరిగి రావడంతో ఆయన కూడా చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

ఐతే ఈ ఇస్మార్ట్ హీరో కొత్త మూవీ సంగతులేవి చెప్పక పోవడం గమనార్హం. ఈ మధ్య కుర్ర హీరోలు ఒకే సారి రెండు మూడు చిత్రాలను పట్టాలెక్కిస్తున్నారు. నితిన్ ఏకంగా మూడు చిత్రాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే.నాని గ్యాంగ్ లీడర్ విడుదలకు సిద్ధమవుతుండగా, మరో చిత్రం వి చిత్రీకరణ దశలో ఉంది. ఇక శర్వానంద్ నటించిన రణరంగం విడుదలకు సిద్ధం కాగా, 96 మూవీ చిత్రీకరణ దశలో ఉంది.ఇక విజయ్ దేవరకొండ నటిస్తున్న హీరో అనే చిత్రం సెట్స్ పై ఉంది. రామ్ మాత్రం మరో చిత్రం ప్రకటించలేదు.

గతంలో రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలు తీసిన కిషోర్ తిరుమల ఓ కథ వినిపించగా రామ్ అనాసక్తి కనబరిచాడని సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :