ఇంట్రస్టింగ్ కాంబినేషన్ లో ఎమోషనల్ ఎంటర్ టైనర్ !

Published on Aug 7, 2019 1:03 am IST

దర్శకుడు అజ‌య్ భూప‌తి “ఆర్ఎక్స్ 100” సినిమాతో సంచలన విజయం సాధించినా.. రెండో సినిమాకి మాత్రం బాగా విరామం తీసుకున్నాడు. అయితే అజ‌య్ భూప‌తి తరువాత సినిమా పై సోషల్ మీడియాలో ఎప్పటికపుడు ఏదొక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కాగా అజేయ్ భూపతి మాత్రం ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజతో తన రెండో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘మహాసముద్రం’ అని టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో క్లాస్ హీరో అనిపించుకున్న సిద్ధార్థ్ కూడా మరో హీరోగా నటిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం రవితేజ – సిద్ధార్థ్ కాంబినేషన్ ఫిక్స్ అవ్వటం ఖాయమేనట. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందట. సినిమాలో సిద్ధార్థ్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ మధ్య అయితే సిద్ధార్థ్ తెలుగు సినిమాలు చెయ్యలేదు. వరుసగా తమిళ సినిమాలే చేస్తున్నాడు.

కాగా ఈ సినిమాలో రవితేజకి జోడిగా అదితిరావు హైదరీ నటించనుంది. సెప్టెంబర్ మొదటి వారం నుండి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను జెమిని కిరణ్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :