‘బ్యాచిలర్ పార్టీ’ని ప్రారంభించిన ‘హీరో శ్రీకాంత్’ !

‘బ్యాచిలర్ పార్టీ’ని ప్రారంభించిన ‘హీరో శ్రీకాంత్’ !

Published on Mar 24, 2019 7:18 PM IST

డి. రామకృష్ణ దర్శకత్వంలో సుధాకర్ ఇంపెక్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకం పై భూపాల్, అరుణ్ హీరోలుగా రాబోతున్న చిత్రం ” బ్యాచిలర్ పార్టీ”. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హీరో శ్రీకాంత్ విచ్చేసి క్లాప్ నిచ్చారు. అనంతరం స్క్రిప్టును చిత్ర నిర్మాత బి.సుధాకర్ రెడ్డి కి అందజేసారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొని టీమ్ ను అభినందించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ’ ఈ కథ వినగానే ఎంతో నచ్చింది. అన్ని కమర్షియల్ హంగులతో యూత్ మెచ్చే చిత్రమవుతుంది. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రాంభించనున్నాం’ఆని అన్నారు. చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ’ ఈ బ్యాచిలర్ పార్టీ, పార్టీ లాగా ఉండదు. ఆద్యంతం సస్పెన్ తో, యువతకు మంచి వినోదాన్ని అందించే యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. భూపాల్, అరుణ్,రమణా రెడ్డి,బెనర్జీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అద్దంకి రాము, ప్రొడ్యూసర్స్ : బి.సుధాకర్ రెడ్డి,డి.సుబ్బారావు, కధ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: డి.రామకృష్ణ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు