ఈ సినిమా విజయం పట్ల చాలా గర్వంగా ఉంది – సుధీర్ బాబు

Published on Sep 23, 2018 11:12 am IST

హీరో సుధీర్ బాబు, నాభ నటేష్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు ఆర్ ఎస్ నాయుడు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈ చిత్రంతో సుధీర్ బాబు తెలుగుతెరకు ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. కాగా ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి.. గుడ్ రివ్యూస్ తో పాటుగా, మంచి మౌత్ టాక్ ను తెచ్చుకుంది. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకులతో పాటు.. మహేష్ బాబు, రానా, నాని లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాని ప్రశంసించడం విశేషం.

కాగా సుధీర్ బాబు తాజాగా ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం విజయం పట్ల చాలా గర్వంగా చాలా హ్యాపీగా ఉందని చెప్పారు. ఒక నిర్మాతగా తన మొదటి చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నే విధంగా ఉండాలని కోరుకున్నానని.. ‘నన్ను దోచుకుందువటే’ చిత్రం నా కలని నిజం చేసిందని ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అయితే సుధీర్ బాబు గత తన సినిమాల్లో కంటే.. ఈ సినిమాలో కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. పెద్దగా ఎమోషన్ లేని క్యారెక్టరైజేషన్ లో చాలా బాగా నటించాడని సినిమా చూసిన వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సుధీర్ పుల్లల గోపీచంద్ బయోపిక్ లో నటించనున్నారు.

సంబంధిత సమాచారం :