క్రేజీ ఆఫర్ దక్కించుకున్న హీరో సుమంత్..!

Published on Jul 14, 2021 2:15 am IST

హీరో సుమంత్ ఖాతాలో ఒకటి రెండు హిట్ సినిమాలున్నా అవేవి ఆయనను అగ్ర హీరోల జాబితాలో నిలబెట్టలేకపోయాయి. విభిన్న కథలను ఎంచుకుంటూ తనను తాను నిరూపించుకునేందుకు సుమంత్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న సుమంత్‌కి తాజాగా ఓ క్రేజీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది.

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సుమంత్‌ ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారట. 1964 బ్యాక్ డ్రాప్ లో సాగే ఆర్మీ లవ్ స్టోరీ ఇది అని, హీరోకి ధీటుగా నిలిచే పాత్ర కావడంతో సుమంత్ ఆ పాత్రను చేసేందుకు ఏ మాత్రం ఆలోచించకుండా ఒకే చెప్పేసాడట. తెలుగు తమిళ మలయాళ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రియాంకా దత్, స్వప్నా దత్‌ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సుమంత్‌ హీరోగా నటించిన ‘అనగనగా ఒక రౌడీ’ విడుదలకు రెడీ అయ్యింది.

సంబంధిత సమాచారం :