సుమంత్ సినిమాకు ఆ ఐడియా గట్టిగానే వర్కౌట్ అయ్యిందిలే!

Published on Jul 31, 2021 1:00 am IST

అక్కినేని మేనల్లుడు సుమంత్‌కి ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఉండేది. అయితే కొన్నాళ్లుగా ఆయన చేస్తున్న సినిమాలు ప్లాఫ్ అవుతుండడంతో ఇప్పుడు పెద్దగా ఆయన సినిమాల గురుంచి టాక్ వినిపించడం లేదు. ఇదంతా పక్కన పెడితే మూడు నాలుగు రోజులుగా సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ వెడ్డింగ్ కార్డ్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఆయన పేరు తెగ మార్మోగింది. అయితే దీనిపై సుమంత్ స్పందిస్తూ నేను రియల్ లైఫ్‌లో రెండో పెళ్లి చేసుకోవడంలేదని, బయట సర్క్యులేట్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ నేను నటిస్తున్న ఓ లేటెస్ట్ చిత్రంలో నుంచి లీక్ అయ్యిందని చెప్పి అందరి అనుమానాలను నివృత్తి చేసేసాడు.

అయితే సుమంత్ హీరోగా, నైనా గంగూలి హీరోయిన్‌గా కీర్తి కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. పెళ్లి జీవితం, విడాకుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్ కోసమే చిత్ర యూనిట్ ఇందులో నుంచి వెడ్డింగ్ కార్డ్ స్టిల్ లీక్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ ప్రయత్నం చేశారేమో అన్న అనుమానాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి. వరుస ప్లాపుల్లో ఉన్న సుమంత్ గురుంచి, ఆయన సినిమా గురుంచి జనాలు మాట్లాడుకోవాలంటే ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న ఐడియా కరెక్ట్ అని, అది సినిమా స్టోరీకి సింక్ అవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లారిటీ ఇవ్వొచ్చు అనే ఉద్దేశ్యంతోనే చిత్ర బృందం ఇలా చేసి ఉండొచ్చని అనిపిస్తుంది. అయితే ఇలా నిజంగానే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారో, లేక నిజంగానే ఆ కార్డ్ లీక్ అయ్యిందో తెలీదు. కానీ ఒకవేళ నిజంగా చిత్ర యూనిట్ ప్రమోషన్‌లో భాగంగానే ప్లాన్ చేసి ఉంటే కనుక ఈ ఐడియా వంద శాతం వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :