సూపర్ హిట్ కాంబినేషన్ హిట్ అవుతుందా..?

Published on Aug 11, 2019 4:06 pm IST

తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ అంటే… అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ఆరు, వేల్, సింగం 1,2,3 సీక్వెల్స్‌ సూపర్ హిట్‌ అయ్యాయి. దీనికి తోడు సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని పోలీసు పాత్రలో చూపిస్తాడు హరి. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

కాగా దర్శకుడు హరి చియాన్ విక్రమ్ తో సామి చిత్రానికి సీక్వెల్ గా తీసిన సామి స్క్వేర్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కాగా తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం హరి తన తర్వాతి ప్రాజెక్ట్ కు సంబంధించిన కథను సూర్యకి చెప్పాడట .సూర్య కూడా హరి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి హరి ఈ సారి హిట్ కొట్టాలనే కసి మీద ఉన్నాడట. పైగా వీరిద్దరి కాంబినేషన్ పై ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉంటాయి. మరి ఈ సూపర్ హిట్ కాంబినేషన్ హిట్ అవుతుందా.. చూడాలి.

సంబంధిత సమాచారం :