రోడ్డు ప్రమాదానికి గురైన మెగా హీరో.

Published on Jun 13, 2019 8:15 am IST

మెగా హీరో వరుణ్ తేజ్‌ ప్రయాణిస్తున్న కారు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయిని పేట్ సమీపంలో నిన్న రాత్రి ప్రమాదానికి గురైందని సమాచారం. అయితే ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్‌ సురక్షితంగా బయటపడ్డారు. కారు మాత్రం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది. మూవీ షూటింగ్‌ కి కొరకు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వరుణ్ ప్రయాణిస్తున్న ఆడి కార్ ఎదురుగా వస్తున్న ఇండికా కార్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. కారులోని బెలూన్స్ ఓపెన్ కావడంతో వరుణ్‌కు ప్రమాదం తప్పింది. వరుణ్ కారును ఢీకొట్టిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా ఈ ప్రమాద ఘటనపై వరుణ్‌ తేజ్‌ ట్విట్టర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. ‘ నా కారు ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు, అందరం క్షేమంగానే ఉన్నాం . నాపై చూపించిన మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని వరణ్‌ ట్విట్‌ చేశారు. వరుణ్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో ‘వాల్మీకి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత సమాచారం :

More