బాలయ్య, చరణ్‌ సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వాలి !

Published on Dec 31, 2018 9:26 am IST

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలయికలో అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’ (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌ నిన్న విశాఖపట్నంలో ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ.. వైజాగ్‌ కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడే నటన నేర్చుకున్నాను. నా కెరీర్ లో స్వర్ణకమలం, గురు, మల్లీశ్వరి సినిమాల షూటింగ్ ఇక్కడే సాగరతీరంలో జరిగింది. ఇక ఎఫ్‌ 2 విషయానికి వస్తే.. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌ గా ఉంటుంది. మళ్లీ మీకు ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ చిత్రాల్లోని నా కామెడీ టైమింగ్ గుర్తుకు వస్తోందని తెలిపారు.

వెంకీ ఇంకా మాట్లాడుతూ.. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న రజనీకాంత్‌, బాలకృష్ణ, చరణ్‌ ల సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వాలని వెంకటేష్‌ చెప్పారు. ఇక ఈ చిత్రంలో వెంకటేశ్ జోడిగా తమన్నా.. వరుణ్ తేజ్ జోడిగా మెహరీన్ నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో నటకిరీటి రాజేంద్రప్రసాద్ కనిపించనున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :