విజయ్ సేతుపతి సినిమాకి టైటిల్ మార్పు..!

Published on Aug 14, 2021 2:00 am IST

విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రధారులుగా తమిళంలో ఓ సినిమా రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. సెట్స్ పైకి వెళ్లినప్పుడే ఈ సినిమాకు “అన్నాబెల్లె సుబ్రమణ్యం” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ టైటిల్‌ని మార్చినట్టు తెలుస్తుంది.

ప్రస్తుతం విజయ్ సేతుపతికి వివిధ భాషల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకు “అన్నాబెల్లె సేతుపతి” అని పేరు మార్చారట. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి, తాప్సీ ఇద్దరూ కూడా ద్విపాత్రాభినయం పోశిస్తుండడం విశేషం. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :