ప్రమోషన్ కొరకు విజయ్ అలా చేయాలని డిసైడ్ అయ్యాడా?

Published on Jul 13, 2019 7:48 am IST

హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం “డియర్ కామ్రేడ్” ఈనెల 26న విడుదల నేపథ్యంలో రెండు రోజుల ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. రొమాంటిక్ మరియు ఎమోషనల్ ప్యాక్డ్ గా ఉన్న ట్రైలర్ బాగానే అలరిచింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్నీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఐతే ఈ చిత్ర ప్రమోషన్ కొరకు విజయ్ ఓ సరికొత్త ఆలోచనతో వస్తున్నారు. ఈ సినిమా సౌత్ లో నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో రెగ్యులర్ ప్రెస్ మీట్స్ అంటే రొటీన్ గా ఉంటుందని.. కొత్త ఐడియాని అమలు చేస్తున్నాడు. ‘డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్’ పేరుతో ఈవెంట్లు చేయబోతున్నారు.

బెంగుళూరు, చెన్నై, కొచ్చి, హైదరాబాద్, వైజాగ్ సిటీలలో ఓపెన్ లొకేషన్ సినిమాలోని పాటలు ప్లే చేస్తూ డాన్సులు చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తూ.. సినిమాను ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశారు. బెంగుళూరులో జరిగే ఈవెంట్ కి ‘కేజీఎఫ్’ స్టార్ యష్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ఐడియా విజయ్ దే అని తెలుస్తోంది. విజయ్ సరసన మరోమారు రష్మిక మందాన నటిస్తుండగా ,జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More