విక్రమ్ మూవీలో అదే హైలెట్ అంట

Published on Jul 17, 2019 12:51 pm IST

చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వం లో రూపోందిస్తున్న చిత్రం “మిస్ట‌ర్ కెకె” ఈనెల 19న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్ లో భాగంగా నిర్మాతలు నిన్న మిస్టర్ కె కె ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడం జరిగింది. అలాగే పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న హీరో విక్రమ్ “మిస్టర్ కె కె ” చిత్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ఈ చిత్రంలో విక్రమ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగి ఉటుందట, అలాగే సినిమా కొంత భాగం జరిగే వరకు విక్రమ్ అసలు హీరోనా విలనా అనేది ప్రేక్షకులకు అంతుపట్టకుండా ఉంటుందట. హాలీవుడ్ పోలిన కథా,కథనం అయినప్పటికీ ఇక్కడి నేటివిటీ ప్రేక్షకులు ఆశించే ఎమోషన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ మూవీ మొత్తం ఒకరోజు జరిగే కథ కావడంతో కథనంగా ఎక్కడా నెమ్మదించకుండా వేగంగా సాగిపోతుంది. ఈ చిత్రంలో స్టంట్స్ ప్రాన్స్ కి చెందిన స్టంట్స్ కొరియో గ్రాఫర్ గింట్ రూపొందించడం జరిగింది. యాక్షన్ సన్నివేశాలు చాలా సహజంగా ఉంటాయన్నారు. తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విక్రమ్ తన స్థాయి హిట్ కొట్టి చాల కాలం అయ్యింది. మరి మిస్టర్ కె కె చిత్రంతో నైనా తెలుగు ప్రేక్షకులు తననుండి ఆశించే మంచి చిత్రాన్ని అందిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :