స్టార్ హీరో ఇంటికి బాంబు బెదిరింపులు.. తీరా చూస్తే..

స్టార్ హీరో ఇంటికి బాంబు బెదిరింపులు.. తీరా చూస్తే..

Published on Nov 30, 2020 9:58 PM IST

ఈమధ్య స్టార్ హీరోల ఇళ్లకు, కార్యాలయాలకు బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆగంతకులు, ఆకతాయిలు హీరోల ఇళ్లలో బాంబులు పెట్టామంటూ పోలీసులకు ఫోన్లు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇంట్లో బాంబు పెట్టినట్టు ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. దాంతో అలర్ట్ అయిన తిరువన్మయూర్ పోలీసులు బీసంట్ నగర్లోని విక్రమ్ బంగ్లాలో సోదాలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, స్నిప్పర్ డాగ్స్ మొత్తం బంగ్లాను అడుగడుగునా గాలించాయి.

అయితే సోదాల్లో వారికి ఎలాంటి బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. పోలీసులు అదొక ఫేక్ కాల్ అని నిర్థారించుకున్నారు. దీంతో విక్రమ్, అయన కుటుంబం ఊపిరిపీల్చుకున్నారు. విషయం తెలిసిన అభిమానులు కూడ కంగారుపడ్డారు. ఆ ఫోన్ కాల్ విల్లుపురం నుండి వచ్చినట్టు గుర్తించి పోలీస్ శాఖను తప్పుదోవ పట్టించిన ఆ ఆకతాయి వ్యక్తిని గుర్తించే పనిలో పడ్డారు. గతంలో కూడ పలువురు తమిళ సినీ హీరోలు విజయ్, సూర్య, అజిత్ ఇళ్లకు కూడ ఇలాగే బాంబు బెదిరింపులు రావడం, అవన్నీ ఫేక్ అని తేలడం తెలిసిందే. ఆ కేసుల్లో పలువురు అనుమానితులను అరెస్ట్ కూడ చేశారు పోలీసులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు