విశాల్ తెలుగు “అయోగ్య” ఏమైనట్టు…!

Published on Jul 17, 2019 6:30 pm IST

ఇటీవల విడుదలైన తమిళ మూవీ “అయోగ్య” తో విశాల్ మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంలో విశాల్ నటనకు మంచి మార్కులు పడటమే కాకుండా వసూళ్లు కూడా బాగానే సాధించింది. ఈ మూవీ 2015లో ఎన్టీఆర్, పూరి కాంబినేషన్ లో వచ్చిన “టెంపర్” మూవీకి రీమేక్.విశాల్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటించగా వెంకట్ మోహన్ దర్శకత్వం వహించారు.

ఐతే “అయోగ్య” తెలుగు చిత్రం టెంపర్ కి రీమేక్ అయినప్పటికీ పతాక సన్నివేశాలతో పాటు అక్కడక్కడా కొన్ని మార్పులు చేశామన్న నెపంతో విశాల్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఐతే ఏమైందో తెలియదు అయోగ్య గతవారం ధియోటర్లలోకి రాలేదు. గతవారం దొరసాని,నిను వీడని నీడను నేను, రాజ్ దూత్ అనే మూడు చిత్రాలు విడుదల నేపథ్యంలో ధియేటర్ల సమస్య వలన ఏమైనా విడుదల కాలేదా అనేది తెలియదు. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్ ఊసే కనపడకపోవడం ఈ చిత్రం తెలుగులో విడుదల అవుతుందా లేదా అనేది సందేహంగా ఉంది.

సంబంధిత సమాచారం :