పెళ్లి చేసుకోబోతున్న యాక్షన్ హీరో !

Published on Dec 31, 2018 12:12 pm IST

తమిళ యాక్షన్ హీరో విశాల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ప్రస్తుతం కోలీవుడ్ లో మరియు సోషల్ మీడియాలో ఈ న్యూసే వైరల్ గా మారింది. ఇంతకీ విశాల్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే విశాల్ తండ్రి ప్రముఖ నిర్మాత జికె రెడ్డి మాట్లాడుతూ.. అనిషా అనే అమ్మాయితో విశాల్ పెళ్లి నిశ్చయమైందని త్వరలోనే వారి నిశ్చితార్థం హైదరాబాద్లో ఘనంగా జరుగుతుందని తెలిపారు.

మొత్తానికి ఈ స్టార్ హీరో త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడన్నమాట. మరి ఇన్నాళ్లు పెళ్లి గురించి అడిగితే నడిగర్ సంఘం భవనం నిర్మించిన తర్వాత చేసుకుంటానంటూ చెప్పే విశాల్.. చెప్పినట్లుగానే నడిగర్ సంఘం భవనం నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :