‘అర‌ణ్య‌’ నుండి విష్ణు విశాల్ మరో లుక్ !

‘అర‌ణ్య‌’ నుండి విష్ణు విశాల్ మరో లుక్ !

Published on Feb 23, 2020 1:22 PM IST

రానా ద‌గ్గుబాటి టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న `అర‌ణ్య‌’ తెలుగు స‌హా హిందీలో ‘హథీ మేరే సాథి’, త‌మిళంలో ‘కాండన్’ పేర్ల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 2న విడుద‌ల అవుతుంది. కాగా ఈ చిత్రంలో తమిళ యువ నటుడు విష్ణు విశాల్ కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇదివరకే ఆయన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ఆకట్టుకుంది. తాజాగా చిత్ర బృందం విష్ణు విశాల్ మరో లుక్ ను విడుదల చేసింది. అందులో ఆయన ఒక ఏనుగుపై పడుకొని కనిపిస్తున్నారు. ఈ ఎలిఫెంట్ ఫ్రెండ్ లుక్ లో ఆయన క్యూట్ గా ఉన్నారు.

ఆయన పాత్ర ప్రేక్షకులకు బాగా అలరిస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. కాగా ఈ సినిమాని ప్రభు సాల్మన్ డైరెక్ట్ చేస్తున్నారు. పర్యావరణం, అడవుల నరికివేత వంటి సమస్యల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ ఇతర ప్రధాన పాత్రధారులు. శంతను మొయిత్రా సంగీతం అందిస్తుండగా, ఎ.ఆర్. అశోక్ కుమార్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు