మహేష్ మేనల్లుడి చిత్రానికి హీరోయిన్ దొరికింది !

మహేష్ మేనల్లుడి చిత్రానికి హీరోయిన్ దొరికింది !

Published on Oct 14, 2018 9:40 PM IST

Nabha Natesh

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో అశోక్ హీరోగా లాంచ్ కానున్నాడు. ఇక ఈచిత్రంలో హీరోయిన్ గా నాబా నటేష్ నటించనుంది.

నాబా ఇటీవల ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈచిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా నాబా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. దాంతో దిల్ రాజు ఈ కొత్త చిత్రానికి ఆమెను సెలక్ట్ చేశారట. ఈచిత్రాన్ని నూతన దర్శకుడు శశి కుమార్ తెరకెక్కించనున్నారు. డిసెంబర్ లో ఈచిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

తాజా వార్తలు