సోడాల శ్రీదేవి తల్లి కాబోతుంది..!

Published on Aug 31, 2021 12:00 am IST

‘శ్రీదేవి సోడా సెంటర్‌’లో సోడాల శ్రీదేవిగా నటించిన హీరోయిన్‌ ఆనంది తన నటనతో ఆకట్టుకుంది. ఈ తెలుగమ్మాయి కెరిర్ ప్రారంభంలో ‘ఈ రోజుల్లో, బస్ స్టాప్’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ నెమ్మదిగా తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టిన వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా మారింది.

ఈ నేపధ్యంలో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌తో ఆమె ప్రేమలో పడింది. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జనవరి 7న ఆనంది ప్రియుడిని వివాహం చేసుకుంది. అయితే ఆనంది త్వరలోనే తల్లి కాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణిగా ఉందని, త్వరలోనే కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఆనంది పెళ్లికి ముందు నటించిన ‘జాంబిరెడ్డి’ సినిమా ఫిబ్రవరిలో విడుదల కాగా, ‘శ్రీదేవి సోడా సెంటర్’ రీసెంట్‌గా విడుదలయ్యింది.

సంబంధిత సమాచారం :