విజయ్ తో జాయిన్ అయిన బాలీవుడ్ బేబీ అనన్య

Published on Feb 20, 2020 10:34 am IST

పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి షెడ్యూల్ ముంబైలో పూర్తి చేసిన చిత్ర యూనిట్ తాజా షెడ్యూల్ హైదరాబాద్ వేదికగా మొదలైంది. కాగా లేటెస్ట్ షెడ్యూల్ నందు హీరోయిన్ అనన్య పాండే జాయిన్ అయ్యారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సెట్స్ లో విజయ్ మరియు డైరెక్టర్ పూరి ,నిర్మాత ఛార్మితో ఆమె దిగిన ఫోటోలు బయటికి వచ్చాయి. విజయ్ పక్కన అనన్య సూపర్ గా స్టైలిష్ గా ఉంది.

ఇక ఈ చిత్రంలో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపిస్తుండగా, హిందీ మరియు తెలుగు భాషలలో ఏక కాలంలో తెరకెక్కుతుంది. బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్, ఈ చిత్రంలో నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక ఈ చిత్రానికి ఫైటర్ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రమ్య కృష్ణ ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :