మలయాళ రీమేక్‌లో అంజలికి ఛాన్స్?

Published on Aug 10, 2021 1:30 am IST

కరోనా కారణంగా సినిమా థియేటర్లు మొన్నటి వరకు మూతపడడంతో ఓటీటీలకు సినీ ప్రేమికులు బాగా అలవాటుపడ్డారు. దీనిని క్యాచ్ చేసుకున్న ఓటీటీ సంస్థలు ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు ఫ్రెష్ కంటెంట్‌ని అందించేందుకు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే మలయాళం నుంచి ఈ మధ్య ఎక్కువ సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్నాయి. ఇటీవల మలయాళంలో వచ్చిన ‘నాయాట్టు’ సినిమాకు అక్కడ మంచి ఆదరణ లభించింది.

అయితే మార్టిన్ ప్రకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రైట్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడిందట. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నారని, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ రీమేక్‌లో హీరోయిన్ అంజలి, సత్యదేవ్, రావు రమేశ్‌లు ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :