డ్రైవర్ కి కరోనా రావడంతో హీరోయిన్ హడల్…!

డ్రైవర్ కి కరోనా రావడంతో హీరోయిన్ హడల్…!

Published on Jul 14, 2020 10:41 AM IST

స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ డ్రైవర్ కి కరోనా వైరస్ సోకడంతో అప్రమత్తమయ్యారు. ఆమె తన ఫ్యామిలీ మొత్తం కరోనా టెస్టులు చేయించుకున్నారు. అదృష్టవశాత్తు సారా అలీఖాన్ కుటుంబంలో ఎవరికీ కరోనా సోకలేదని తేలింది. ఈ విషయాన్ని సారా అలీఖాన్ తన ఫ్యాన్స్ కి తెలియజేశారు.

ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో ఉంది. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతుండగా…ప్రముఖులు సైతం దీనిబారిన పడుతున్నారు. అమితాబ్ తో పాటు అభిషేక్, ఐశ్వర్య మరియు ఆరాధ్యలకు కరోనా వైరస్ సోకింది. ఈ నలుగురు ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ప్రముఖ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కుటుంబంలో నలుగురు కరోనా బారినపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు